calender_icon.png 5 November, 2024 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ కాబోయి అథ్లెట్‌గా

14-05-2024 01:53:04 AM

దండి జ్యోతిక శ్రీ

ఒలింపిక్స్‌లో 

పతకమే లక్ష్యంగా

తండ్రి కలను తన కలగా మార్చుకొని ఆయనను గర్వపడేలా చేయడమే లక్ష్యంగా ట్రాక్‌పై పరిగెత్తడం ప్రారంభించింది. తండ్రి ఆశయం కోసం డాక్టర్ కావాలనుకున్న తన ఇష్టాన్ని మనసులోనే చంపేసుకుంది. మహిళల 400 మీటర్ల రిలేలో చిరుతను మించిన వేగంతో బ్యాటన్ అందుకొని పరుగెత్తడం అలవాటుగా మార్చుకుంది తెలుగు తేజం దండి జ్యోతిక శ్రీ. 

ఇటీవలే వరల్డ్ రిలేలో 4x400 మీటర్ల ఫైనల్లో భారత మహిళల బృందం స్వర్ణం నెగ్గి పారిస్ బెర్త్ అందుకోవడంలో జ్యోతికదే కీలకపాత్ర. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయిలో పేరు పొందిన జ్యోతిక ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రస్తుతం ఫెడరేషన్ కప్‌లో బిజీగా ఉన్న జ్యోతిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  

ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

భువనేశ్వర్: మా నాన్న శ్రీనివాసరావు యుక్త వయసులో మంచి బాడీ బిల్డర్. దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకున్నప్పటికీ ఆయన కల నెరవేరలేదు. నా చిన్నప్పుడే నేను అథ్లెటిక్స్‌లో రాణించగలనని బలంగా నమ్మారు. అందుకే నన్ను అథ్లెటిక్స్ వైపు ప్రోత్సహించాడు. ఏదో ఒకరోజు నన్ను ఒలింపిక్స్‌లో చూడాలనుకున్నారు. మరో మూడు నెలల్లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్ ద్వారా నా తండ్రి కల నెరవేరబోతుంది. అయితే చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్నా. కానీ నాన్న మీద ప్రేమతో అయిష్టంగానే అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టాను. 2017 వరకు కూడా అథ్లెటిక్స్‌పై అస్సలు ఆసక్తి కనబరచలేదు. కానీ నా తండ్రి నాకోసం చేసిన త్యాగాలు, క్రీడలపై ఆయనకు ఉన్న ఆసక్తిని గమనించి ఆ క్షణమే అథ్లెట్‌గా మారిపోవాలని నిర్ణయించుకున్నా. డాక్టర్ కాఊఊవాల్సిన నేను ఇవాళ పూర్తిస్థాయి అథ్లెట్‌గా మారిపోయా. చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను. నా తండ్రి అన్ని విషయాల్లో మద్దతుగా నిలిచి ప్రోత్సహించేవాడు. 2017 వరకు కూడా నాలో డాక్టర్ కావాలన్న ఆశ చావలేదు. దీంతో పదో తరగతి పూర్తయ్యాకా సైన్స్ గ్రూప్‌లో చేరాలనుకున్నా.. కానీ నాన్న కోరిక గుర్తొచ్చి చివరి నిమిషంలో సీఈసీ తీసుకున్నా. ఆ తర్వాత అథ్లెటిక్స్‌పైనే దృష్టి సారించా. ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని 400 మీటర్ల రిలేలో జాతీయ చాంపియన్‌గా నిలిచా. పారిస్  ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తామని అనుకోలేదు.