* అక్రమవలసదారుల కాళ్లకు గొలుసులు!
* ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఎంపీలు
* వివరణ ఇచ్చిన విదేశాంగ మంత్రి
* భారత మెతక వైఖరే కారణం అంటున్న నేతలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఏజెంట్ల చేతిలో మోసపోయి అమెరికాలో అక్రమంగా ఉం టున్న వారిని అమెరికన్ ప్రభుత్వం అవమానకర రీతిలో వెనక్కు పంపింది. దీనిపై గురు వారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. మీ మెతక వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ ఆరోపించాయి.
విపక్షాల ఆ రోపణలకు మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. డిపోర్టేషన్ ప్రక్రియ గురించి వివరిం చారు. అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉం టున్న భారతీయులతో దురుసుగా ప్రవర్తించకుండా వారితో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
ఇంత అమానవీయమా..
అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులతో మిలిటరీ మిమానం అమృత్‌సర్‌కు చేరుకుంది. కేవలం ఒకే బాత్రూమ్ ఉన్న మిలటరీ విమానంలో పు రుషులు, మహిళలు, పిల్లలని చూడకుండా తీసుకొచ్చిన అమెరికా విధానం మీద పలువురు ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్లకార్డులతో నిరసన
ప్రతిపక్ష ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ తదితరులు పార్లమెంట్ ఆవర ణలో నిరసనకు దిగారు. చేతులకు బేడీలు వేసి తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆంశం మీద ఇటు లోక్‌సభతో పాటు అటు రాజ్యసభ కూడా దద్దరిల్లింది. సమాజ్‌వాదీ, తృణమూల్, ఆప్, కమ్యూనిస్టులు ఈ ఆంశం మీద చర్చకు పట్టుబట్టా యి.
వాయిదా నోటీసులు అందజేశాయి. కానీ వారు అందించిన నోటీసులకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రిజెక్ట్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఇది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయం అని చెప్పి ఎంపీలను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో సభను వాయిదావేశారు. అనంతరం ఈ ఘటన మీద కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానం చెప్పారు.
ఇదేం కొత్త కాదు..
డిపోర్టేషన్ ప్రక్రియ అనేది ఏం కొత్త కాదు అని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ‘ఎన్నో ఏండ్ల నుంచి యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న వారిని ఇలాగే పంపుతున్నారు. కేవలం ఒక్క దేశం వారిని ఇలా పంపరు. ఏ దేశమైనా అక్రమ వలసదారులను వెనక్కి పంపుతుంది’ అని అన్నారు. నిబంధనల మేరకే వారిని నిర్బంధిస్తారని, వారు టాయిలెట్‌కు వెళ్లే సమయంలో వాటిని తొలగిస్తారని తెలిపారు.
ఇది చాలా రోజుల నుంచి జరుగు తున్న ప్రక్రియే అని వివరించారు. మహిళలు, చిన్నారులను నిర్బంధించలేదని ఐసీ ఈ అధికారులు తమకు తెలిపారని స్పష్టం చేశారు. అమెరికా నుంచి వచ్చిన వారికి అవసరం అయిన సదుపాయాలు సమకూర్చా మన్నారు. ఇకపై నుంచి డీపోర్టేషన్ చేస్తున్నపుడు వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో మాట్లాడతామని హామీనిచ్చారు.
ఇండియన్లకు సంకెళ్లు వేశారా?
ఈ రగడ జరుగుతుండగానే అమెరికా సరిహద్దు గస్తీ విభాగం చీఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో పెనుదుమారం రేపింది. ‘చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదే శీయులను విజయవంతంగా వెనక్కి పంపా ం’ అని ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సీ విమానం ఉంది. అందులోకి ఎక్కేవారికి సంకెళ్లు వేసి ఉన్నాయి. వారు భారతీయులే అని అంతా ఆరోపిస్తున్నారు.
అవి ఫేక్ ఫొటోలు
అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతులకు బేడీ లు ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ‘ఆ ఫొటోలు ఇండియన్స్‌వి కావు. గ్వాటెమాల దేశస్తులవి’ అని పేర్కొంది.
అవును బేడీలేశారు..
భారత్‌కు వచ్చిన తమకు బేడీలు వేసింది నిజమే అని బాధితుల్లో కొందరు పేర్కొన్నారు. 36 ఏండ్ల జస్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని వేరే క్యాంప్‌కు తీసుకెళ్తున్నారని అనుకున్నాం. మిమ్మల్ని భారత్‌కు తీసుకె ళ్తున్నాం అని ఓ పోలీసాయన చెప్పా డు. మా చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు కట్టారు’ అని మీడియాకు వివరించారు.
ఎవరిని బహిష్కరిస్తారంటే..
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) నిబంధనలు ఏం చెబుతున్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రజల భద్రతకు ముప్పు తలపట్టే, వీసాలను ఉల్లంఘన, నేరపూరిత మైన చర్యల్లో పాల్గొన్న అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం బంధిస్తుంది.
ఆ తర్వాత వారిని ఇమ్మిగ్రేషన్ కోర్టులో ప్రవేశపెడుతుంది. కోర్టు ఆదేశాల ప్ర కా రం తొలుత సదరు అక్రమవలసదారులకు స్వచ్ఛందంగా దేశాన్ని వీడే అవకాశం ఇస్తుంది. ఒక వేళ అక్రమవలసదారులు అందుకు అంగీకరించకపోతే బలవంతంగానైనా స్వదేశానికి పంపిస్తుంది.
వారి బహిష్కరణకు అవకాశాలు తక్కువ
అమెరికాలో అక్రమంగా నివాసం ఉం టూ పట్టుబడ్డప్పటికీ కొన్ని సందర్భాల్లో బహిష్కరణ నుంచి తప్పించుకోవచ్చు. స్వదేశానికి వెళ్తే తమ ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని ఇమ్మిగ్రేషన్ కోర్టులో నిరూపించి ఆశ్రయం కోసం దరఖాస్తు చే సుకుంటే టెంపరరీ ప్రొటెక్టడ్ సేటస్(టీసీఎస్) ద్వారా బహిష్కరణ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
మార్చి 31, 2024 నా టికి టీపీఎస్ కింద అమెరికాలో ఆశ్రయం పొందుతు న్న వారి సంఖ్య 8,63,880గా ఉంది. పిల్లలతో కలిసి అమెరికాకు అక్రమంగా ఎవరైనా వలస వెళ్తే వారి బహి ష్కరణ ప్రక్రియను డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌వుడ్ అరైవ్స్(డీఏసీఏ) నిబంధనలు ఆలస్యం చేస్తాయి.
డాంకీ రూట్ కష్టాలు
డాలర్ కలల్ని నిజం చేసుకునేందుకు అందినకాడికి అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో లక్షలు పోసిన అమాయకులు వారు మోసం చేయడంతో చేసేదేం లేక అక్రమమార్గాల్లో అగ్రరాజ్యానికి పయనం అయ్యారు. పనామా, మెక్సికో సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు. ఈ తరుణంలో ఎన్నో అగచాట్లు పడ్డట్లు బాధితులు పేర్కొన్నారు.
72 లక్షలు ఖర్చు చేశా
హర్యానాకు చెందిన 20 ఏండ్ల ఆకాశ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘ప్రమాదకరమైన మెక్సికో, పనామా భూభాగాలను దాటేందుకు రూ. 72 లక్షలు ఖర్చు చేశా’ అని పేర్కొన్నాడు. ఆయన కుటుంబం విడుదల చేసిన వీడియోలో ఆకాశ్ పడిన కష్టాలు కనిపిస్తున్నాయి. అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఇతరులతో కలిసి ఆకాశ్ ముందుకు సాగాడు. డాంకీ రూట్‌లో అతడు పడిన కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకాశ్ ఒక్కడే కాకుండా ఎందరో ఇతర వలసదారులు కూడా ఇందులో కనిపిస్తున్నారు.