04-04-2025 01:07:21 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 3: (విజయక్రాంతి) : తెలంగాణ జిల్లాలో నూతనంగా దొడ్డి కొమురయ్య పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు చీర అశోక్ అన్నారు.గురువారం గూడూరు మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
దొడ్డి కొమురయ్య విగ్రహానికి ఆనుకోట జిల్లా అధ్యక్షులు చీర అశోక్,చీర బిక్షపతి, విగ్రహ కమిటీ అధ్యక్షులు కుండే కిషన్, బ్లాక్ అధ్యక్షులు కత్తి స్వామి, మాజీ ఎంపీపీలు నునావత్ రమేష్ నాయక్, చెల్పూరి వెంకన్న,అరే వీరన్న, ముఖ్య నాయకులు కలిసి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈసందర్బంగా పలువురు మాట్లాడుతూ నిజం నవాబు తెలంగాణ పోరాట యోధుడిగా దొడ్డి కొమురయ్య ఉన్నారని ఆయన పేరుతో తెలంగాణలో ఆయన 98వ జయంతి సందర్భంగా యాదవులు ఎక్కువగా ఉన్న జిల్లాను దొడ్డి కొమురయ్య జిల్లాగా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతంగ సాయుధ పోరాట అమరవీరుడిగా దొడ్డి కొమురయ్య ఎంతో పోరాటం చేశారని ఆయన సేవలను గుర్తిస్తూ ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా ఆయనకు ఘన నివాళులు అర్పించినవారం అవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు మండల కొమురయ్య, దొడ్డి కొమురయ్య,పోతారాజు రవి, మండల శ్రీను, కోరే దేవేందర్, కుండే కుమార్, కోరే అనిల్, తదితరులు పాల్గొన్నారు.