calender_icon.png 4 January, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్‌లో ఖాకీల డిష్యుం.. డిష్యుం!

02-01-2025 12:21:24 AM

  1. కానిస్టేబుల్ సస్పెన్షన్, వీఆర్‌కు హోంగార్డు అటాచ్
  2. పెన్‌పహాడ్ స్టేషన్‌లో ఘటన

పెన్‌పహాడ్, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలు చేసుకోమని ఇచ్చిన డబ్బులు ఒక్కరే వాడుకోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఇద్దరి ఖాకీలు పిడి గుద్దులు కురిపించుకున్న ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఎస్సై గోపి కృష్ణ తెలిపిన ప్రకారం..

పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ జాటోత్ రవికుమార్, హోంగార్డు గంజి శ్రీనుకు కలసి డిసెంబర్ 28న మండల కేంద్రంలోని ఓ టీ స్టాల్ యజమాని నూతన సంవత్సరం రోజు దావత్ చేసుకోమని ఇద్దరికీ కలిపి రూ.  ఇచ్చాడు. రవికుమార్ ఒక్కడే వాడుకోవడంతో ఇద్దరి మధ్య స్టేషన్‌లో గొడవ జరిగింది.

మాటల యుద్ధం పెరిగి పిడిగుద్దుల ఘర్షణకు దాకా పోయింది. ఇదంతా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రజల ముందే జరగడం గమనార్హం. ఈ విషయం ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ దృష్టికి వెళ్లడంతో కానిస్టేబుల్ రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. హోంగార్డు శ్రీనును వీఆర్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్సై తెలిపారు.