46 మంది కార్పొరేటర్లకు హాజరైంది 26 మందే..
మహేశ్వరం, జూలై 19: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డిపై పెట్టిన అవిశ్వాస పరీక్ష వీగిపోయింది. మున్సిపల్ కార్యాలయంలో ఉద యం 11 గంటలకు అవిశ్వాస పరీక్ష నిర్వహించేందుకు కందుకూర్ ఆర్డీవో సూరజ్‌కు మార్ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి 11.30 నిమిషాల మధ్య అవిశ్వాస పరీక్ష ప్రవేశపెట్టనున్నట్లు మొదట తెలి పారు. అయితే, సమయం దాటిపోయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి న కార్పొరేటర్లు హాజరు కాకపోవడంతో ఆర్డీవో మరికొంత సమయం కేటాయించారు. 12 గంటల నుంచి 12.30 నిమిషాల మధ్య రెండోసారి సభ్యులకు అవకాశం కల్పించారు.
అయితే, 12 గంటల తర్వాత సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాస పరీక్ష పెట్టారు. సరైన కోరం లేని కారణంగా అవిశ్వాసం విగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. మొత్తం 46 మంది కార్పొరేటర్లకు 31 మంది హాజకు కావాల్సి ఉండగా బీజేపీకి చెందిన 19 మం ది, కాంగ్రెస్‌కు చెందిన 7 మంది కార్పొరేట ర్లు మాత్రమే హాజరయ్యారు. మరో ఐదుగురు తక్కువగా ఉండడంతో అవిశ్వాసం వీగిపోయిందని ఆర్డీవో తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అవిశ్వాస పరీక్ష సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.