calender_icon.png 27 December, 2024 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ముంపునకు గురైన పాఠశాలలను పరిశీలించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం

03-12-2024 05:57:42 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వరదలతో నష్టపోయి, పాడైపోయిన పాఠశాలల తనిఖీలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని అశ్వాపురం మండలంలో ఎలుకలగూడెం, మిట్టగూడెం పాఠశాలలను మంగళవారం సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం పరిశీలించింది. ఈ తనిఖీలో భాగంగా పాడైపోయిన పాఠశాలల యొక్క భవనాలను, వరద ముంపుకు గురైన సామాగ్రి, పుస్తకాలను తనిఖీ చేయడం జరిగినది. ఈ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంట్రల్ టీం సభ్యులు ప్రదీప్ తెలిపారు. వారి వెంట విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మండల విద్యాధికారి వీరాస్వామి పాల్గొన్నారు.