21-03-2025 12:34:37 AM
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
వారాసిగూడ (విజయ క్రాంతి) 20 మార్చి : కాంగ్రె స్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి నిరాశను మిగిల్చే బడ్జెట్ ప్రవేశపెట్టింది. సంక్షేమం, అభివృద్ధికి పూర్తిగా తిలోదకాలు పలకడంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించింది. పించన్ల పెంపు, కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం, రూ.2500 చొప్పున మహా లక్ష్మి పథకం, నిరుద్యోగ బృతి వంటి ఏ హామీలకు నిధులు కేటాయించలేదు.
జంట నగరాల ప్రజలు వేసవికి ముందే దాహార్తిని ఎదుర్కొంటున్నారు. మౌళిక సదుపాయాలకు సంబందించిన ప్రాజెక్టులను ప్రభు త్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభు త్వం అన్ని వర్గాల వారికి నిరాశను మిగిల్చే బడ్జెట్ ప్రవేశపెట్టింది. సంక్షేమం, అభివృద్ధికి పూర్తిగా తిలోదకాలు పలకడంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించింది.