calender_icon.png 21 April, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2 పరీక్ష రాస్తూ సొమ్మసిల్లిన విద్యార్థి

16-12-2024 08:47:53 PM

పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో గ్రూప్-2 పరీక్ష రాస్తున్న పుల్కల్ మండలం లక్ష్మీ సాగర్ గ్రామానికి చెందిన నగేష్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. పరీక్ష రాస్తునే సొమ్మసిల్లి పడిపోయాడు. మరో గంటలో పరీక్ష ముగుస్తుందనగా విద్యార్థి సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నగేష్ ను హుటాహుటిన పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.