నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మహిళలకు హామీ ఇచ్చిన రూపాయలు 2500 ఇవ్వాలని కోరుతూ బిఎల్ఎఫ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మహిళలకు 2500 అందించేందుకు ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కింద దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అమలు చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కళావతి తదితరులు పాల్గొన్నారు.