calender_icon.png 22 February, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లి కాంప్లెక్స్ లో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల ప్రదర్శన-బాలమేళ

21-02-2025 07:54:03 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి కాంప్లెక్స్ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం రూపొందించిన ఎల్ఎఫ్ఎన్ బాలమేళా 2025 ను టేకులపల్లి కాంప్లెక్స్ పరిధిలో వున్న ప్రతి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్ధులు తయారు చేసిన నమూనాలను సమర్ధవంతంగా, సృజనాత్మకంగా తయారు చేసినందున వాటి ప్రదర్శన కాంప్లెక్స్ ప్రదానోపాద్యాయులు మెరుగు శ్రీనివాస్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల విద్యశాఖాధికారి ఏ.జగన్ మాట్లాడుతూ... విద్యార్ధులు నేర్చుకున్న, సృష్టించిన ప్రతీ అంశాన్ని ప్రదర్శించి ఈ బాలమేళాను విజయవంతం చేసినందున అభినందించారు.

అనంతరం హెడ్ మాస్టర్ మెరుగు శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇది విద్యార్ధుల ఎదుగుదలకు, కళాత్మక వ్యక్తీకరణకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బాలమేళ ప్రథమ బహుమతి పొందిన బేతంపూడి, ద్వితీయ బహుమతి రేగుల్ తండ, తృతీయ బహుమతి పాత తడికలపూడి అభినందించారు. విద్యార్ధులు చక్కని పాటలతో, డాన్సులతో ప్రదర్శన చేసి బాల మేళను విజయ వంతం చేశారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గూగులోత్ నరేష్, కాంప్లెక్స్ సెక్రటరీ బాణోత్ లక్ష్మ, వేంకట్రం, సీఆర్ఫీ నాగేశ్వరావు, సుజాత, మంగిలాల్, హతీరం, వీరన్న, భారతి, స్వరూప, రాణి, రాంబాబు, బలరాం, రాంబాబు పాల్గొన్నారు.