హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా బీసీ వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ 20వ తేదీన హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో బహిరంగ విచా రణ చేపట్టనున్నట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. మాసబ్‌ట్యాంక్ కమిషన్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వినతులు స్వీకరిస్తామని కమిషన్ పేర్కొం ది. ఈ అవకాశాన్ని రాజకీయ పార్టీ లు, బీసీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థ లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.