calender_icon.png 28 November, 2024 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుపై తేమ కత్తి

28-11-2024 12:31:52 AM

  1. సీసీఐ కేంద్రాల్లో కొర్రీలు 
  2. రోజుల తరబడి నిరీక్షణ

కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాం తి): సీసీఐ కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పత్తి రైతులకు తేమ పేరిట కోతలు కొనసాగుతున్నాయి. పత్తి అమ్మేందుకు సీసీఐ కేంద్రాల వద్ద రోజుల తరబడి నీరిక్షించాల్సి వస్తుంది. తమవంతు కోసం ఒక్కరోజు ముందే క్యూలో నిల్చోవల్సిన పరిస్థితి నెలకొంది.

రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల పత్తినే సీసీఐలో కొటున్నారు. వర్షాధారం కింద సాగు చేస్తే ఎకరానికి 8 క్వింటాళ్లు, నీటి వసతి కింద అయితే ఎకరానికి 14 క్వింటాళ్ల చొప్పున తీసుకుంటున్నారు. అయితే సీసీఐ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకే విక్రయాలు ప్రారంభించాలి.

కానీ ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. రైతులు పశ్నిస్తే వాహనాలు అడ్డంగా ఉన్నాయని, నిల్వలకు స్థలం సరిపోవడం లేదని నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారు. పత్తి అన్‌లోడింగ్ కావాలంటే మూడు రోజులు పడిగాపులు కాయాల్సిందే. 

మధ్యలోనే ఆపేస్తున్నారు

ఉన్నతాధికారులు సీసీఐ కేంద్రం పరిశీలనకు వచ్చిన రోజు దాదాపు 100 వాహనా లు అన్‌లోడ్ చేస్తున్నారు. మిగతా రోజుల్లో 60 వాహనాలకు మించడం లేదు. ఎవరైతే రూ.100 నుంచి రూ.200 చెల్లిస్తారో వారి వాహనాల్లోని పత్తిని మాత్రమే అన్‌లోడ్ చేస్తున్నారు. ఎందుకివ్వాలని అడిగితే మధ్య లో నిలిపివేసి తేమశాతం ఎక్కువగా ఉందని, పత్తి నాసిరకంగా ఉందంటూ నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు.

దీంతో ఒక్కో కేం ద్రంలో 40 నుంచి 60 వాహనాలు అలేగే ఉంటున్నాయి. తేమ పరిశీలించి తూకాలు వేసి, పత్తి డంప్ చేయాలంటే ఒక్కో వాహనానికి అరగంట సమయం పడుతుంది. సీసీఐ కేంద్రంలో సిబ్బంది తక్కువగా ఉండటంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 

కొరవడిన పర్యవేక్షణ

సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లో అధికారి ఎవరో, ప్రైవేట్ వ్యక్తి ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. మార్కెటింగ్ శాఖ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

మద్నూర్‌లో అందుబాటులో ఉండాల్సిన కార్యదర్శి బోధన్ మార్కెట్ యార్డుకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుడటంతో ఇక్కడ సమయం తక్కువగా కేటాయిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో సీసీఐ నిర్వాహకులు, జిమ్మింగ్ మిల్లుల యాజమానులు కుమ్మక్కై నిబంధనలు పాటించడం లేదని తెలుస్తున్నది. ప్రవేట్ వ్యక్తులకు రైతులు ఎంతో కొంత ముట్టజెప్పితే వాహనాలను అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.