calender_icon.png 27 October, 2024 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు ఒక డీఏ

27-10-2024 02:09:47 AM

దీపావళి కానుక..

  1. నవంబర్ ౩౦లోగా జనగణన పూర్తి
  2. దీపావళి కానుకగా అతిపేదలకు 
  3. ౩1న ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

  4. రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో ఫేస్
  5. మిల్లర్ల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ నిర్ణయం
  6. పీటీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం
  7. ఉద్యోగుల బదిలీకి అనుమతి

  8. కేటగిరీల వారీగా మిల్లర్ల విభజన
  9. పల్లె, మండల రోడ్లకు మహర్దశ
  10. క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు 
  11. నాలుగు గంటల పాటు భేటీ
  12. వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నవంబర్ 30వ తేదీలోపు రాష్ట్రంలో కులగణన పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. నవంబర్ 4 నుంచి 19 వరకు రాష్ట్రమంతా ఇంటింటి సర్వే చేపట్టాలని తీర్మానించింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది.

దాదాపు నాలుగు గంటల పాటు నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. కులగణనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒకటి ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు దీపావళి కానుకగా మొదటి విడత కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రులు తెలిపారు. పారదర్శకంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు.

దీపావళి తర్వాత గ్రామ సభలను ఏర్పాటు చేసి, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో, 46 జీవోల కారణంగా కొత్త నియామకాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఈ సమస్యల పరిష్కారం కోసం నియమించిన సబ్ కమిటీ 15 సార్లు సమావేశమై నివేదికను సీఎంకు అందేజేసినట్లు వివరించారు.

ఈ నేపథ్యంలో 317 జీవోలో భాగంగా మ్యూచివల్, హెల్త్, స్పౌస్ కేటగిరీలకు చెందిన బదిలీలను వెంటనే చేపట్టాలని క్యాబినెట్‌లో నిర్ణయించినట్లు వివరించారు. స్థానికత వంటి మరికొన్ని సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం క్లియరెన్స్ కావాలని చెప్పారు. క్లియరెన్స్ కోసం కేంద్రానికి నివేదికను పంపనున్నట్లు వెల్లడించారు. 

మిల్లర్ల సమస్యల పరిష్కారానికి సానుకూలం

రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. గత సర్కారు సేకరించిన దాదాపు రూ.20 వేల కోట్ల విలువ చేసే ధాన్యం మిల్లర్ల వద్ద మిగిలిపోయినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో బ్యాం కు గ్యారెంటీ సమస్య పరిష్కారానికి పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. అప్పటి దాకా మిల్లర్లను క్యాటగిరీలవారీగా విభజించనున్నట్లు వివరించారు. క్లీట్ చిట్ ఇచ్చిన వారిని, ఒకసారి నోటీస్ ఇచ్చినవారిని కొం దరిని జాబితా నుంచి తొలగించినట్లు చెప్పా రు. మిల్లర సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

16వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం

పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీకి సంబంధించి 16 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించాల్సి ఉందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నాలు లేన్ల రోడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.

పీపీపీ విధానంలో ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని రాబోయే నాలుగేళ్లలో రూ.25 వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా ప్టెటుకున్నట్లు చెప్పారు. రోడ్ల నిర్మాణం కోసం ఇతర స్టేట్స్‌లోని రోడ్లను పరిశీలించి డీపీఆర్‌ను తయారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు.

సమగ్రంగా కులగణన: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో అన్ని కులాల రాజకీయ, ఆర్థిక పరిస్థితులను నమోదుచేసేందుకు సమగ్ర సర్వే చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొత్తం 80 వేల మంది ఎన్యుమరేటర్లు ఈ సర్వేలో పాల్గొననున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ దాదాపు 150 ఇళ్లను సర్వే చేస్తారు.

ఇందుకోసం గ్రామ, మండ ల, జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తా రు. గత సర్కారు చేసిన సర్వేను దాచిప్టెటిందని, తాము అలా చేయబోమని స్పష్టం చేశారు. బీసీ సంఘాలు, ప్రజలు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాని కోరా రు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కుదుటపడితే అన్ని ప్రయోజనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఒక డీఏ పెంచడం వల్ల ప్రభుత్వంపై రూ.3000 కోట్ల భారం పడుతుందని తెలిపారు.

మిగతా సమస్యలూ పరిష్కరించండి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి 

ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించటంపై తెలంగాణ ఉద్యో గుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  మిగ తా సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వంలో నాలుగు, ప్రస్తుత ప్రభుత్వంలో ఒకటి చొప్పున డిఏలు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. డీఏ ప్రకటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

మెట్రోరైలు రెండో దశకు ఆమోదం

రెండో దశ మెట్రో రైలు విస్తరణపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 76.4 కిలోమీటర్ల మెట్రో రైలు విస్తరణకు రూ.24,269 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. రెండో దశ ప్రాజెక్టును కేంద్రం-రాష్ట్ర జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించారు.

ఈ క్రమంలో ఆమోదం కోసం డీపీఆర్‌ను కేంద్రానికి పంపాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్, ఎల్బీనగర్ నంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు, రాయదుర్గం కోకాపేట, ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట, మియాపూర్  పటాన్‌చెరు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు ఇవీ..

* ములుగు సమ్మక్క-సారలమ్మ గిరిజన వర్సిటీకి ౨౧౧ ఎకరాలు

* రెవెన్యూ డివిజన్‌గా ఏటూరు నాగారం

* ఆరువేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

* ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ గ్రౌండ్ భూమి బదలాయింపు

* యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. గచ్చిబౌలిలో ఇప్పుడున్న స్టేడియంలో యూనివర్సిటీ ఏర్పాటు.

* స్కిల్ యూనివర్సిటీకి అను బంధంగా మధిర, వికారాబాద్, హుజూర్‌నగర్‌లో ఐటీఐలను ఏర్పాటుచేయాలని నిర్ణయం

* కొత్త కోర్టులు, కాలేజీల్లో స్టాఫ్ నియామకానికి ఆమోదం.

* రిజర్వాయర్లలో సిల్ట్ పేరుకు పోయి వాటర్ స్టోరేజీ కేపాసిటీ తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పైలట్ ప్రాజెక్టులో భాగంగా కడెం ప్రాజెక్టులో సిల్ట్‌ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.