calender_icon.png 12 February, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరీక్షణకు తెర!

12-02-2025 01:36:34 AM

  1. 2008-డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు 
  2. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీగా నియామకం
  3. ప్రక్రియను మొదలుపెట్టిన విద్యాశాఖ అధికారులు 
  4. నేడో రేపో జీవో విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరప డబోతోంది. హైకోర్టు తీర్పుతో 2008-డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ మొదలైంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు నియామక ప్రక్రియను ప్రారంభించా రు. వీరి నియామకానికి సంబంధించిన జీవోను విడుదల చేయాల్సి ఉండగా, అధికారిక సమాచారం ప్రకారం బుధ లేదా గురువారం జీవో జారీకానున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

మొత్తం 1,382 అభ్య ర్థులకు ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ను జారీచేయనుంది. 2008-డీఎస్సీ అభ్యర్థుల రిక్రూట్‌మెంట్‌పై సోమవారం హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం సైతం రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం కేవలం జీవోను మాత్రమే జారీచేయాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో అభ్యర్థులు కోర్టుకెళ్లగా, కోర్టు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ వర్గాలు కసరత్తు వేగవంతం చేశాయి. 2008-డీఎస్సీ అభ్యర్థులను టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) కేడర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. వీరికి ఎస్జీటీ బేసిక్‌పేను వేతనంగా ఇవ్వనున్నారు.

అంటే హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సు లు మినహా రూ.31,040 వేతనంగా ఇస్తారు. అయితే అప్పట్లో నోటిఫికేషన్ జారీచేసినప్పు డు ఉమ్మడి 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. తర్వాత రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 33 జిల్లాలు ప్రాతిపదికగా తీసుకుని నియామకాలు పూర్తిచేయాలని అధికారులు నిర్ణయిం చారు. ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు జాబితా వెళ్లనుంది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, డీఈవోలు నియామకపత్రాలు అందజేసి, అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తారు. 

జరిగింది ఇదీ..

డీఎస్సీ-2008లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు కూడా అర్హులేనని నోటిఫికేషన్‌లో నాటి ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం ప్రత్యేకంగా డీఎడ్ అభ్యర్థులకు కేటాయించింది. దీంతో తొలి జాబితాలో ఎంపికైన 2,367 మందికి రెండో లిస్టులో ఉద్యోగాలు రాలేదు.

దీంతో తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థులు న్యాయపోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా వీరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అలాగే వీరిపై ప్రభు త్వం సైతం సానుకూలంగా ఉండటంతో ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ కాం ట్రాక్టు పద్ధతిలో టీచర్ ఉద్యోగాల్లో తీసుకోవాలని నిర్ణయించింది.

అప్పట్లో దాదాపు 2,367 మంది అభ్యర్థులుండగా, వీరిలో చా లా మంది వివిధ ఉద్యోగాల్లో చేరిపోగా, మి గిలిన 1,382 మందికి ప్రస్తుతం ఉద్యోగాలివ్వనున్నారు.