28-04-2025 12:45:56 AM
- అచ్చంపేటలో హోటల్ పరివార్ నిర్వాకం
- ఫిర్యాదుతో స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
అచ్చంపేట ఏప్రిల్ 27: బోటి కర్రి ఆర్డర్ ఇచ్చిన ఓ మాంసం ప్రియుడికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటికెళ్ళి భోజనం చేద్దామని బోటి కర్రి ఆర్డర్ ఇస్తే హోటల్ యజమాని ఎలుకతో కూడిన బోటి ఫ్రై పార్సిల్ ఇచ్చాడు. తీరా ఇంటికెళ్ళి తిందామని పార్సిల్ ఓపెన్ చేస్తే ఎలుక దర్శనమిచ్చింది.
వెంటనే సదురు హోటల్ యజమానిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని హోటల్ పరివార్ హోటల్ వద్ద శుక్రవారం చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అధికారీ మనోజ్ కుమార్ శనివారం హోటల్ పరివార్, హోటల్ తాజ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లను తనికి చేశారు. శాంపిలను సేకరించారు. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా తరచూ జరగడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.