అమెరికన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, వింబుల్డన్ విజేత కోకో గాఫ్ పోరాటం ముగిసింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనుకున్న గాఫ్‌కు నిరాశే ఎదురైంది. మంగళవారం వెకిక్ (క్రొయేషియా)తో జరిగిన మ్యాచ్‌లో కోకో గాఫ్ పరాజయం చవిచూసింది. మ్యాచ్ సందర్భంగా చైర్ ఎంపైర్‌తో కోకో వాగ్వాదానికి దిగి ఎమోషనల్ అయింది. మొదటి రెండు మ్యాచ్‌లను సులభంగా నెగ్గిన ఈ స్టార్ మూడో మ్యాచ్‌లో పరాజయం పాలయ్యింది. దీంతో ఓటమిని తట్టుకోలేక అంపైర్‌తో గొడవ పడిన గాఫ్ ఏడుస్తూ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.