20-04-2025 12:00:00 AM
కరీంనగర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ..
అల్ఫోర్స్ విద్యాసం స్థలకు చెందిన ఎన్.శరణ్య 49వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, పి.శ్రీహర్ష 244వ ర్యాంకు, ఎన్.అనిరుద్ సాయి 272, డి.విశాల్ 329, జె.వామిక 350, టి.ప్రణతి 456, ఈ.అంకిత్ సాయి 574, బి.ఆదిత్యా 630, టి.శివాత్మిక 646, వి.హృ షికేష్ 703, మహమ్మద్ అబ్దులాక్ 968, పవార్ తేజ్పాల్ 1056, ఎం అక్షిత 1148, డి విశాల్ 1270, బి ధనుష్ 1298, ఏ అనిరుద్ 1343, టి శివాని 1378, అర్.సుమిత్ కుమా ర్ 1637, డి.కార్తిక్ రెడ్డి 1826, మహ్మద్ అబ్దుల్ జీషన్ 1989, బి.విష్ణు 2000వ ర్యాంకులు సాధించారని చెప్పారు.
అలాగే 1000 లోపు 11 ర్యాంకులు, 2000 లోపు 21 ర్యాంకులు, 5000 లోపు 40 ర్యాంకులు ర్యాంకులు సాధించగా, 459 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. రాబోయే ఐఐ టీ అడ్వాన్స్ పరీక్ష రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని నరేం దర్‌రెడ్డి అభినందించారు.