క్రైమ్, సస్పెన్స్, త్రిల్లర్ చిత్రాలను సినీ ప్రియులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో ప్రస్తుతం ‘అసుర సంహారం’ అనే సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని శ్రీసాయి ప్రవర్తిక బోయళ్ల సమర్పణలో శ్రీసాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ల నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్నింటి బాధ్యతను కిషోర్ శ్రీకృష్ణ తీసుకున్నారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి విలేజ్ డిటెక్టివ్‌గా ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించనుండగా మిధునప్రియ కీలక పాత్రలో నటించనున్నారు. విలేజ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా శనివారం ఈ సినిమా పోస్టర్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇతర తారాగణం, ఇతర వివరాల గురించి మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.