calender_icon.png 20 January, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం

07-07-2024 02:32:50 AM

గోదావరిఖనిలో నార్కోటిక్ డాగ్స్‌తో తనిఖీలు

రామగుండం (మంథని), జూన్ 6 (విజయక్రాంతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి, మత్తు పదార్థాల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు బాబుల ఆటకట్టించేందుకు గోదావరిఖనిలో నార్కోటిక్ డాగ్స్‌ను రంగంలోకి దింపారు. రామగుండం సీపీ శ్రీనివాసు లు ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ రమేశ్ పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ఇందిరానగర్‌లో నార్కోటిక్ డాగ్స్‌తో ఇంటిం టి తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. స్థానికంగా కొత్త వ్యక్తు లు, నేరస్థులు షెల్టర్ తీసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత గంజాయి, మద్యం, డ్రగ్స్‌లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దనిసూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ లింగమూర్తి, ఎస్సైలు సమ్మయ్య, శ్రీనివాస్, సుగుణాకర్, ఏఎస్సైలు సనత్ రెడ్డి, వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.