25-03-2025 01:21:02 AM
ఆస్తి పన్ను చెల్లించని వారి ఆస్తులు సీజ్
కరీంనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): మొండి బకాయి దారులపై నగరపాలక సంస్థ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. నోటీసులు ఇచ్చిన స్పందించకుండా నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు చెల్లించని బకాయిదారుల ప్రాపర్టీలను సీజ్ చేస్తున్నారు. సోమవారం నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను చెల్లించకుండా 10 లక్షల వరకు బకాయి ఉన్న రాంనగర్ ప్రాంతంలోని లిటిల్ పార్కుతో పాటు వెంకటసాయి సినిమా థియేటర్, బ్యూటీ పార్లర్ ప్రాపర్టీలను సీజ్ చేసి.. నగరపాలక సంస్థ బ్యానర్ ను ఏర్పాటు చేశారు.
గత కొంత కాలంగా నగరపాలక సంస్థ కు పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయి ఉండటంతో పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేసిన స్పందిచక పోవడంతో ప్రాపర్టీలను సీజ్ చేశారు. ఆస్తి పన్నుల చెల్లింపు గడువు దగ్గర పడుతుండటంతో మొండి బకాయి దారుల పై నగరపా లక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు ఒత్తిడి పెంచారు. పన్నులు చెల్లించని మొండి బకాయి దారులకు నోటీసులు జారీ చేసి నోటీసులు ఇచ్చిన గడువు ముగియడంతో ప్రాపర్టీల సీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... నగరపాలక సంస్థ కు చెల్లించాల్సిన ఆస్తి బకాయిలను సకాలంలో చెల్లించి కరీంనగర్ అభివృద్ధి సహాకరించాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా మొండి బకాయి దారులు ఆస్తి పన్నులను చెల్లించాలని... చెల్లించని యెడల నోటీసులు జారీ చేసి సంబంధిత ప్రాప్రర్టీలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ అధికారుల కు పురపాలక శాఖ చట్టం ప్రకారం అన్ని రకాల ఆదేశాలను జారీ చేశామని తెలిపారు.
బిగ్ డిఫాల్టర్స్ అందరికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని... వాటి గడువు కూడ ముగుస్తుందన్నారు. నోటీసులు జారీ చేసిన స్పందించని వారి ప్రాపర్టీని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఆస్తి పన్నుల బకాయి దారులు సకాలంలో చెల్లించి అభివృద్ధి సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ స్వరూప రాణీ, ఆర్వో భూమానందం, ఆర్ ఐ లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.