02-04-2025 12:00:00 AM
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
బెట్టింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి
ఆదిలాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్ గేమింగ్ యాప్‌ల కు, ఐపీఎల్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచిం చారు. బెట్టింగ్ కేసులో ఇద్దరినీ అరెస్టు చేశామని తెలిపారు.
మంగళవారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఎస్‌ఐ అశోక్, సిబ్బంది కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఆదిలాబాద్లోని డైట్ గ్రౌండ్‌లో కొందరు వ్యక్తులు ఆన్‌లైన్ లో ‘క్రిక్ బీట్ 99’ యాప్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో దాడి చేశారు.
షేక్ సాజీద్, జోగు సాయి కుమార్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షేక్ సాజిద్ ఫోన్‌ను పరిశీలించగా, అతను ఆన్‌లైన్ బెట్టింగ్ ‘క్రిక్ బీట్ 99’ యాప్‌లో నమోదు చేసుకుని, సాయి కుమార్ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు నిర్దారించారన్నారు. వీరి నుండి రూ.1500, రెండు మొబైల్ ఫోన్‌లు, యాప్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సం పాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి, అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటు న్నారని ఎస్పీ ఆన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ప్లే కార్డ్, గేమ్స్ కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యే క నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బెట్టింగ్ ప్రోత్సహించిన, నిర్వహించి న, బెట్టింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్, ఎస్‌ఐ అశోక్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.