వీడియో కాల్ సాయంతో మెడికోల వైద్యం
జనగామ, జనవరి 7 (విజయక్రాంతి): ప్రసవ వేదనతో తల్లడి ఓ ఆవుకు మెడికల్ విద్యార్థులు ప్రాణభిక్ష పెట్టారు. మంగళ ఓ ఆవు కేఎంసీ ఆవరణలో మేత మేస్తోంది. నిండు గర్భంతో ఉన్న ఆ ఆవుకు ఒక్కసారిగా నొప్పు వచ్చాయి. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆవును కేయూ మెడికల్ రెండో సంవత్సరం విద్యార్థులు గమనించారు. ఎలా ప్రసవం చేయాలో వారికి తెలియకపోవడం వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు వీడియో కాల్ చేశారు. ఆయన సూచనల ప్రకారం ఆవుకు విజయవంతంగా ప్రసవం చేశారు. ఆవును రక్షించిన విద్యార్థులు ఉదయ్‌కిరణ్, స్వరూప్, మోహన్‌దీప్, షన్ముక్, నవనీత్, హేమంత్, మధుకర్‌లకు రైతు కృతజ్ఞతలు తెలిపారు.