- రూ.5 కోట్లతో జిల్లా మహిళ సమాఖ్య భవన నిర్మాణానికి
- భూమి పూజ మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి: గద్వాల
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జనవరి 23 ( విజయక్రాంతి ) : మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. గురువారం దౌదర్ పల్లి మెడికల్ కళాశాల వద్ద ఐదు కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం పాఠశాలల విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫారాలు కొట్టేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా జిల్లాకు 7 వేల ఇండ్లు మంజూరు కాబోతున్నందున, ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకల తయారీ యూనిట్లను మహిళా సంఘాలకు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి...
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మహిళా సంఘాల కోసం ఒక ఎకరం 15 గుంటల స్థలంలో రూ. 5 కోట్ల వ్యాయంతో నూతన భవన నిర్మాణం చేపట్టడం సంతోషదాయకమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సోలార్ యూనిట్లు అందించి ఆదాయం సమకూర్చనున్నందున మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
తమ ఇళ్లలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించుకునే విధంగా కాటేజ్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయాలని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించాలని, ఇందుకు బ్యాంకర్లు మహిళా సంఘాలకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
సోలార్ యూనిట్లుతొ పాటు గొర్రెలు, కోళ్లు, ఫిష్ యూనిట్లు నెలకొల్పుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు రోజు వారి కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా మహిళా సంఘం భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నరసింహారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, పంచాయతీరాజ్ ఈ ఈ దామోదర్ రావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంగీత, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.