calender_icon.png 23 November, 2024 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి తహసీల్దార్ అరెస్టు

10-10-2024 12:20:23 AM

ధరణి ఆపరేటర్‌తో కలిసి అతడి బంధువుల పేరున 36.23 ఎకరాల భూమి నమోదు

రూ.14.63 లక్షల రైతుబంధు స్వాహా 

సూర్యాపేట/హుజూర్‌నగర్, అక్టోబర్ 9: అధికార దుర్వినియోగానికి పాల్పడిన తహసీల్దార్‌తో పాటు, ఘటనతో సంబంధం ఉ న్న ధరణి ఆపరేటర్‌ను హుజూర్‌నగర్ పోలీస్‌లు బుధవారం అరెస్ట్ చేసి, 14 రోజుల రి మాండ్‌కు తరలించారు.

హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్ వజ్రాల జయశ్రీ గతంలో హుజూర్‌నగర్ తహసీల్దార్‌గా పనిచేశారు. 2019లో హుజూర్‌నగర్‌లో ఉన్న సమయంలో బూరుగడ్డ, హుజూర్‌నగర్ గ్రామాల పరిధిలోని 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్యాలయ ధరణి ఆపరేటర్‌గా పని చేస్తున్న జగదీశ్‌తో కలిసి అతడి బంధువుల పేరుపై ఐఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్ ద్వారా అక్రమంగా నమోదు చేశారు.

36.23 ఎకరాల భూమి విలువ సు మారు రూ.1.56 కోట్ల పైచిలుకు ఉంటుంది. అయితే ఈ భూమికి రైతుబందు సాయం కింద వచ్చిన రూ.14.63 లక్షలు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ సమాన వాటాలుగా పంచుకున్నారు. ఉన్నతాధికారుల రికార్డుల పరి శీలనలో ఈ విషయం బయటకు రావడం తో ధరణి ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీనికి బాధ్యురాలైన త హసీల్దార్ జయశ్రీపై కేసు నమోదు చేసి ఆమెతో పాటు ధరణి ఆపరేటర్‌ను బుధవా రం అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో హు జూర్‌నగర్ ఎస్సై ముత్తయ్య పాల్గొన్నాడు.