ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన ప్రజా పథకాల అమలు వాటి సర్వేపై అరుంధతి నగర్ బస్తీలో ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సర్వే నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ నేతలతో కలిసి శనివారం బస్తీల్లో ఆమె పర్యటించారు. ఆరు పథకాల అమలులో అవకతవకలు వున్నాయని, డివిజన్ లో చాలా మంది పేద ప్రజల పేర్లు నమోదు కాలేదని, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంటు పథకాల సర్వేలో లబ్ధి పొందని ప్రజలు ప్రభుత్వం పై ఆగ్రహంగా వున్నారని, తమకు న్యాయం చేయాలని తమ భాదను వెళ్ళబోసుకున్నారని కార్పొరేటర్ తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... మరోసారి పెద ప్రజల పేర్ల నమోదు చేసుకునే అవకాశం కల్పించేందుకు అధికారులకు సూచించామని, త్వరలో అధికారులు వచ్చి అందరి పేర్లను నమోదు చేసుంటారని, పేదల కొరకు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల అమలుకు గాంధీనగర్ డివిజన్ లోని ప్రతి పేద కుటుంభం లబ్ధి పొందేలా కచ్చితంగా ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రజలకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు. సర్వేలో ఏవైనా సమస్యలు వుంటే తమ కార్పొరేటర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కార్పొరేటర్ కోరారు. పర్యటనలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నవీన్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, సురేష్, నాయకులు ఆనంద్ రావు, అరుణ్ కుమార్, ప్రశాంత్, అరుంధతి నగర్ బస్తి నాయకులు తదితరులు పాల్గొన్నారు.