- కొత్తగూడెం కార్పొరేషన్‌పై అనేక సందేహాలు
- అసాధ్యం అంటున్న పలు సంఘాల నేతలు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (విజయక్రాం తి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పా శనివారం క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపిన విషయం విధితమే. దీనిపై కొత్తగూడెం జిల్లాలో తీవ్ర చర్చ సాగుతున్నది.
సమస్యలు, సందేహాలు తీర్చకుండా కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యమా అనేది ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. ఏజెన్సీ చట్టా భౌ గోళిక సమస్యలు పరిష్కరించకుండా కార్పొరేషన్ ఏర్పాటు ఎలా సాద్యమని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు గత 25 సంవత్సరాలుగా ఏజెన్సీ వివాదంతో పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిలిచిపోయా యి.
మరో వైపు పూర్తిస్థాయిలో అర్బన్ స్వభావం రాని సుజాతనగర్ మండలాన్ని కార్పొరేషన్‌లో కలపడం ఆ ప్రాంత ప్రజలపై పన్నుల భా మోపడమే తప్ప మరొకటి కాదని రాజకీయ విశ్లేషకుల వాదన. భౌగోళికంగా చూస్తే పాల్వంచ పట్టణాన్ని ఆనుకుని ఉన్న కేసీఎం పెట్రోల్ బంకు నుంచి కొత్తగూడెంలోని మొర్రేడు వాగు బ్రి అవతలి వరకు లక్ష్మిదేవిపల్లి మండలం పరిధిలో ఉంది.
ఆ తర్వాత కొత్తగూడెం పొస్టాఫీసు సెంటర్ వరకు కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉండి, పోస్టాఫీస్ సెంటర్ దాటిన తర్వాత చుంచుపల్లి మండలం ప్రారంభమవుతుంది. ఆ మండలం తర్వాత వచ్చే సుజాతనగర్ మండలంలోని సుజాతనగ్, లక్ష్మిదేవిపల్లి, మంగపేట తదితర పంచాయతీలతో కలిపి కార్పొరేషన్ చేస్తామనడం హేతుబద్దంగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీ వరకు రెం డు వైపులా సుమారు 4 కిలోమీటర్ల మేరకు ఫా రెస్టు విస్తరించి ఉంది. ఇలాంటి పరిస్థితిలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఎలాంటి అభివృద్ధి జరుగు తుందన్న చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికీ పా ల్వంచలో రెవెన్యూ అధికారులు ఏజెన్సీ సర్టిఫి ఇస్తున్నారు.
రాంనగర్‌లో ఇటీవల ఒకరికి ఉద్యోగం కోసం రాంనగర్ ఏజెన్సీలో ఉన్నట్లు సర్టిఫికెట్‌ను రెవెన్యూ అధికారులు జారీ చేయడంతో పాల్వంచ ఏజెన్సీ ప్రాంతమా, నాన్ ఏజెన్సీ ప్రాంతమా అనే గందరగోళం చోటు చేసుకొంది. ఇలాంటి ఏజెన్సీ సమస్యలు పరిష్కరించకుండా కార్పొరేషన్ ఏర్పాటు అసాధ్యమని పలువురు అంటున్నారు.
రియల్ వ్యాపారులకు లాభం
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రకటించారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇ ప్పటికే సుజాతనగర్, పాల్వంచ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఏర్పాటుతో వ్యాపారం మరింత పుంజుకొనే వీలుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ సమస్యతో 25ఏళ్లుగా ఎన్నికలకు నోచుకోని పాల్వంచ సమస్యనే కొత్తగూడెం కార్పొరేషన్‌కు రానుందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.