బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జనవరి 13 : (విజయక్రాంతి): సమాజ మార్పు కోసం నిర్మాణా సైన్యాన్ని తయారు చేయాలని, అందుకు లెక్చరర్లు, మేధావులు బీసీ ఉద్యమా భుజానెత్తుకొని పోరాడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య పిలుపునిచ్చారు. చదువు ద్వారానే కులాలు అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
సోమవారం కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య కాముని సుదర్శన్ అధ్యక్షతన తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
హాజరైన ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సమాజంలో గుణాత్మకమైన, పరిణామాత్మకమైన మా ర్పు రావాలంటే, పేదవారికి న్యా జరగాలంటే బీసీ లెక్చరర్స్ పాత్ర ముఖ్యమైంద న్నారు. ప్రపంచంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పు మేధావులతోనే సాధ్యం అయ్యిందన్నారు.