calender_icon.png 17 November, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిత్యాన్వేషి

11-11-2024 12:00:00 AM

తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య పరిశోధన అనగానే ఎవరికైనా మొదట స్ఫురించే పేరు ఆచార్య వెలుదండ నిత్యానందరావు. నిరంతర పరిశ్రమ, అభిరుచి, జ్ఞానాన్వేషణ తృష్ణ ఆయనను ఈ స్థా యికి చేర్చాయి. ఆయన రాసే ప్రతి వ్యాసమూ ఏదో ఒక కొత్త అంశంతో కూ డుకున్నదే. ఒక పరి శోధనాత్మక ఫలిత మే. నిత్య విద్యార్థిగా, సత్యాన్వేషిగా, ఉత్త మ పరి శోధకుడిగా, పరిశోధనల మార్గదర్శిగా, విమర్శకుడి గా, ఆచార్యుడిగా, ర సావిష్కర్తగా ఆయన ప్రయాణం ప్రత్యేకమైంది. తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బాధ్యతల స్వీకరణ ఒక మజిలీనే తప్ప ఆయ న గమ్యం కాదు. ఇంకా ఎన్నో శిఖరాలు పొందే సత్తా ఉన్న నిత్యానందరావు ఉత్తమ పరిపాలకుడిగానూ తప్పక రాణిస్తారు. 

రచనా వ్యాసంగాన్ని 1978లో ప్రారంభించిన వెలుదండ నిత్యానందరావు తొలి నాళ్ల లో కవిత్వం, కథ, నాటకం మొదలైన ప్రక్రియల్లో రచనలు చేశారు. తర్వాత జీవిత చరి త్రలు, పరిశోధనలు, విమర్శలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా సాహిత్యాలపై జరిగిన పరిశోధనలపై సమగ్ర సూచీని తెచ్చి, భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేకూర్చే గొప్ప పని చేశారు. పరిశోధనాంశం, పరిశోధన, విశ్వవిద్యాలయం, పర్యవేక్షకులు, పరిశోధన పూర్తి చేసి న సంవత్సరం మొదలైన సమగ్ర వివరాలతో ఆయన రూపొందించిన ‘విశ్వవిద్యా లయాల్లో తెలుగు పరిశోధన’ గ్రంథం 1987 లో తొలిసారిగా ప్రచురితమైంది.

ఎన్నో వ్య య ప్రయాసలకోర్చి, ఒక విశ్వవిద్యాలయమో ఒక సంస్థో చేయవలసిన ఈ పనిని ఆయన ఒంటి చేత్తో చేయడం అభినందనీయం. తెలుగు పరిశోధనపై ఆయన రాసిన ‘తెలుగు పరిశోధన’ గ్రంథాన్ని తెలు గు అకాడమీ 2012లో వెలువరించింది. హైదరా బాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్రను గ్రంథరూపంలోకి తెచ్చారు. వందేమాతరం గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ జీవిత విశేషాలతోపాటు రచనలను విశ్లేషిస్తూ ‘భారతీ య జ్వలిత చేతన బంకించంద్ర’ అనే సాధికారిక గ్రంథాన్ని వెలువరించారు.

ఎం.ఫిల్, పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాలను 1990, 1994 సం వత్సరాల్లో ముద్రణా రూపంలోకి తెచ్చారు. వికట ప్రబంధం, పేరడీలపై ఎం.ఫిల్., పీహెచ్‌డీ స్థాయిలో పరిశోధించిన నిత్యానంద రావు అదే హాస్యధోరణిలో పలు వ్యాసాలను క్రోడీకరించి ‘హాస విలాసం’ పేరుతో 2005 లో గ్రంథంగా తెచ్చారు. తర్వాతి కాలంలో ‘నిత్య వైవిధ్యం’, నిత్యానుశీలనం’, ‘నిత్యాన్వేషణం’ గ్రంథాలను వెలువ రించారు.

4,000 పుటలలో 7 సంపుటాలు

అరవయ్యో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా నిత్యానందరావు ఒక వినూత్న ప్రయోగం చేశారు. నెలకో గ్రంథం చొప్పున ముద్రణా రూపంలోకి తేవాలన్న సత్సంకల్పంతో 4,000 పుటలలో 7 సంపుటాలను వెలువరించారు. ఇవన్నీ వైవిధ్యమైనవే. వీటి లో మొదటిదైన ‘అనుభూతి- అన్వేషణ’ వెలుదండ రాసిన సమీక్షలు, పీఠికల సమాహారం. పలువురు రచయితల సాహిత్య వ్యక్తిత్వ సౌరభాలతో కూడిన ‘అక్షరమాల’ ఈ క్రమంలో రెండవది. సాహిత్య, భాషా సంబంధ వ్యాసా ల ‘వాగ్దేవీ వరివస్య’, ఎం.ఫిల్., పీహెచ్‌డీ మొదలైన వాటితో కూడిన ‘పరిశోధక ప్రభ’ ఈ క్రమంలోనే వచ్చాయి.

సాంప్రదాయక, సాంస్కృతిక, రాజకీయ, హాస్య విశ్లేషణాత్మక వ్యాసాలతో ‘వ్యాసశేముషి’ని తెచ్చారు. నాటకాలు, కథలు, కవితలు, లేఖలు మొదలైన వాటితో ‘సృజనానందం’, బంకించంద్ర, బూర్గుల జీవిత చరిత్రలతో కూడిన ‘ఆదర్శపథం’ ఈ సంపుటాలలోనివే.   

వెలుదండ నిత్యానందరావు పరిశోధక దృష్టి చాలా లోతైంది, విస్తృతమైంది. ఎవరికీ దొరకని సాహితీవేత్తల విశేషాలను గుది గుచ్చి చెప్పడంలో ఆయన సిద్ధహస్తులు. వ్యాసాలకు నిత్యానందరావు పెట్టే శీర్షికలూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆరుద్రను ‘పీఠికాపురాధీశ్వరుడి’గా, పుల్లెల శ్రీరామచంద్రుడిని ‘ఆంధ్ర కవిచంద్రుడి’గా, కసిరెడ్డిని ‘క్షాత్ర తేజస్సంపన్నుడి’గా, బాలగంగాధర తిలక్‌ను ‘నవభావామృత రసధుని’గా పేర్కొన్నారు. ‘అక్షరమాల’ గ్రంథంలోని ఈ శీర్షికలు పాఠకులను అత్యమితంగా ఆకట్టుకుంటాయి. 

పరిశోధన, విమర్శలకే పూర్తి కాలం కేటాయించే ఆచార్య నిత్యానందరావు నాలుగు న్నర దశాబ్దాలుగా సాహిత్య సేవ చేస్తున్నారు. ఇప్పటికీ కొత్త విషయం నేర్చుకో వడానికి, ప్రతి విషయంలోని వినూత్న అం శాన్ని కనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. గొప్ప చదువరి. ప్రామాణిక పరిశోధనకు పర్యాయపదమైన ఆచార్య వెలుదండ నిత్యానందరావు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకు లపతిగా బాధ్యతలు చేపట్టడం సాహిత్య ప్రియులకు ఆనందం కలిగించే విషయం.

 - డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు