calender_icon.png 12 March, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లా సైన్యంలో తిరుగుబాటుకు కుట్ర.!

11-03-2025 11:35:55 PM

లెఫ్టినెంట్ జనరల్ ఫిజుర్ రెహమాన్‌పై నిఘా వర్గాల కన్ను..

ఆదేశాలు జారీ చేసిన బంగ్లా ఆర్మీ చీఫ్.. 

ఢాకా: పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలున్న బంగ్లాదేశ్ సైనిక అధికారి లెప్టినెంట్ జనరల్ ఫిజుర్ రెహమాన్‌పై నిఘా ఉంచినట్లు ఆర్మీ చీఫ్ వాకర్ తెలిపారు. సైన్యంలో తిరుగబాటుకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జమాత్ సానుభూతి పరుడైన ఫిజుర్ రెహమాన్ యాక్టింగ్ ఆర్మీ చీఫ్‌ను పదవి నుంచి తప్పించేందుకు, ఆయనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు డివిజనల్ కమాండర్స్‌తో సమావేశాలు నిర్వహించినట్లు బంగ్లా ఆర్మీకి సమాచారం అందింది. అయితే మద్దతు సాధించడంలో ఫిజుర్ రెహమాన్ విఫలమయ్యారని తెలుస్తోంది.

మార్చి తొలి వారంలోనే డివిజనల్ కమాండర్స్‌తో సమావేశం కావాలని ఫిజుర్ రెహమాన్ భావించాడు. అయితే ఆర్మీ చీఫ్ సెక్రటరియట్‌కు ముందస్తు సమాచారం అందడంతో సమావేశానికి హాజరైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమాండర్లను హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. అంతకముందు జనవరి, ఫిబ్రవరిలో ఫిజుర్ రెహమాన్ జమాత్ నేతలతో, పాకిస్థాన్ దౌత్యవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ ఫిజుర్ వాకర్ సమాచారంతో ఇంటలిజెన్స్ వర్గాలు రెహమాన్‌పై కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది.