calender_icon.png 28 November, 2024 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డదారిన అందలం ఎక్కేందుకు కుట్ర

28-11-2024 02:24:49 AM

  1. 30న జరిగే రైతు సభను విజయవంతం చేయాలి 
  2. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): అడ్డదారిన అందలం ఎక్కేందుకు కొన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయని రాష్ర్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆరోపించారు. బుధవారం సచివాలయం మీడియా సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు.

ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. నిర్మాణాత్మక పాత్రను పోషించాల్సిన విపక్షాలు.. అందుకు భిన్నంగా సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దని కోరారు. రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారని తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని అమిస్తాపూర్ ఈనెల 30న జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. 28, 29, 30 తేదీల్లో అమిస్తాపూర్ ప్రాంతంలో మూడు రోజులపాటు రైతు సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇందులో 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈనెల 28న ఎగ్జిబిషన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల పంపిణీని మరిచిపోయిందని, స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్ విస్మరించిందని  విమర్శించారు.