ట్రినిడాడ్: సూపర్ అవకాశాలు కోల్పోయిన న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం గ్రూప్ భాగంగా పసికూన ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండా 18.4 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. ఉగాండా జట్టులో వయిస్వా (11) ఒక్కడే రెండంకెల స్కోరు అందుకోగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు తీయగా.. బౌల్ట్, సాంట్నర్, రచిన్ రవీంద్రలు తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేంది. ఫిన్ అలెన్ 9 పరుగులు చేసి ఔటవగా.. కాన్వే (22 నాటౌట్) , రవీంద్ర (1 నాటౌట్) జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ న్యూజిలాండ్ ఇంటిబాట పట్టనుంది. ఇప్పటికే గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, అఫ్గానిస్థాన్‌లు సూపర్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే.