calender_icon.png 3 February, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శుద్ధి అయోధ్య’ ఆకర్షణ..!

02-02-2025 10:27:32 PM

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు ఫణీంద్ర నర్సెటి తెరకెక్కిస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’. ఇందులో ‘మ్యాడ్’ సినిమా ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ కథానాయికగా నటిస్తోంది. కన్న పసునూరి, అనంతిక, హనురెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనున్న అనంతికకు సంబంధించి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అనంతిక బర్త్‌డే విషెస్ చెప్తూ ఆదివారం చిత్రబృందం విడుదల చేసిన ఆమె లుక్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. అనంతిక ఫొటోను పంచుకుంటూ ‘మీ దయ, ఆకర్షణ శుద్ధి అయోధ్యను మరింత ప్రత్యేకంగా మలిచాయి’ అంటూ రాసుకొచ్చారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి డీవోపీ: విశ్వనాథ్‌రెడ్డి; సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్.