calender_icon.png 6 November, 2024 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికే రోల్ మోడల్ కుటుంబ సమగ్ర సర్వే..

06-11-2024 03:27:42 PM

పటాన్చెరు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సర్వేతో రాష్ట్ర ప్రజలందరి ఆర్థిక స్థితిగతుల అంచనాతో పాటు అన్ని విధాల లబ్ది చేకూరుతుందని తెలిపారు. బీసీ కుల గణనతో  కులాల వారీగా బీసీలకు రాజకీయ అవకాశాలు అధికమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేలో సేకరించిన సమాచారాన్ని గుప్తంగా  ఉంచబడుతుందని తెలిపారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక, ఆర్థిక న్యాయం జరగడం కోసమే ఈ సమగ్ర సర్వే అన్నారు. బ్రిటీష్ కాలంలో 1831వ సంవత్సరంలో జరిగిన కుల గణన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఇప్పుడే ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాహుల్ గాంధీ చాలెంజ్ గా తీసుకుని తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ లు మంత్రి కార్యక్రమానికి హాజరు కాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.