calender_icon.png 24 November, 2024 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక సమగ్ర భూ సర్వే

13-11-2024 12:25:11 AM

  1. భూ రికార్డుల విభాగాల పటిష్టతకు ప్రభుత్వం కసరత్తు
  2. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి ఇక నక్ష ఉండాల్సిందే!
  3. ధరణి సమస్యలూ ఇక ఉండవు

కామారెడ్డి, నవంబర్ 12 (విజయక్రాంతి): భూ రికార్డుల విభాగాల పటిష్టతపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. భూ వివాదాలు ఉండకుండా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి సర్వే నిర్వహించి నక్ష ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. సమగ్ర భూ సర్వేతోనే ఇది సాధ్య మవుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఈ సర్వేతో భూ సమ స్యలు ఇక ఉండవని, ధరణి సమస్యలు కూడా ఉండకుండా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే ప్రతి వ్యవసాయ క్షేత్రాన్ని సర్వే చేసి నక్షలు రూపొందించి రైతులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

ధరణి సమస్యలకు చెక్

ధరణి సమస్యల పరిష్కారానికి, భూ వివాదాల తొలగింపునకు ప్రతి వ్యవసాయ క్షేత్రానికి తప్పనిసరిగా నక్షా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ధరణిలో అనేక అవకతవకలు జరిగాయని ఆర్వోఆర్‌ేొ2024ను అమలులోకి తేవాలని యోచిస్తోంది. తాజాగా క్రయ విక్రయాలు జరిగే సమయంలో భూ నక్షా చిత్రం తప్పనిసరి చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో సర్వేయర్ల ఆవశ్యకత పెరిగింది.

ఇప్పటి వరకు వీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో గ్రామా ల్లో భూ వివాదాలు పేరుకుపోయాయి. వీటి పరిష్కారానికి ధరణి వెబ్‌సైట్‌లో చోటులేక వివాదస్పదంగా మారాయి. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే భూ రికార్డుల విభాగాల పటిష్టతపై కసరత్తు చేపట్టింది.

ప్రభుత్వ పనుల్లో సర్వేయర్ల బిజీ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత కారణంగా భూముల కొలతలు రైతు ల్ని వేధిస్తున్నాయి. వేల సంఖ్యలో కొలతల కోసం రైతులు అందజేసిన దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్ల కొరత ఉన్న చోట పక్క మండలాల వారికి ఇన్‌చార్జి బా ధ్యతలు అప్పగించారు. దీనికి తోడు ప్రభుత్వ పనులు అధికంగా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రైతుల భూముల సర్వేలో జాప్యం ఏర్పడుతోందని పలువురు సర్వేయర్లు పేర్కొంటున్నారు.

ఇందూర్‌లో సర్వేయర్ల కొరత

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 65 మం డలాలు ఉండగా 22 మండలాలకు సర్వేయర్లు, ఆరు మండలాలకు డిప్యూటీ సర్వే యర్లు ఉన్నారు. ఈ జిల్లాలో ఇంకా ఆరు సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 39 మండలాల్లో 18 మండలాలకు సర్వేయ ర్లు ఉన్నారు. ఇంకా 21 మండలాల్లో పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 26 మండలాలు ఉండగా 16 మండలాలకు సర్వేయర్లు ఉన్నారు. ఇంకా 10 మండలాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం 

ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిజాం పాలనలో సెత్వార్ పేరిట 1938-45 కాలంలో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ గ్రామాల్లో పట్టాదారుల సమాచారంతో కాస్త్రా తయారు చేసి అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణించింది.

సమస్య ఏర్పడినప్పుడు విక్రయాలు జరిగి వివాదాలు తలెత్తిన సమయంలో భూ కొలతలు  శాఖ వద్ద ఉన్న టిప్పన్(కొలతల పుస్తకం) రూపంలో కొనుగోలుదారుకు భూమిని అప్పజెబుతూ వస్తున్నారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న కాస్త్రా పహాణి ఆధారంగానే భూ దస్త్రాల ప్రక్షాళన కొనసాగించారు.

అయినా భూముల వివాదాలు అపరిష్కృతంగానే మిగులుతున్నాయి. వాటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే అంశం, నక్షా ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో సర్వేయర్ల ప్రాధాన్యత మరింత పెరిగింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే 

ఉమ్మడి జిల్లాలో ప్రతి భూమికి సంబంధించిన నక్ష ఉండే విధంగా సర్వేను చేపడుతాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే పనులు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతాయి. సర్వేయర్ల కొరత కారణంగా కొంత ఆలస్యం జరిగినా పకడ్బందీగా పూర్తిస్థాయిలో సర్వే పనులను చేపడుతాం. ధరణిలో నమోదు చేసినట్లు కాకుండా సర్వే చేపట్టి ప్రతి భూమికి సంబంధించిన నక్షాను తీసి రైతులకు అందిస్తాం.

  శ్రీనివాస్, జిల్లా భూ కొలతల శాఖ ఏడీ, కామారెడ్డి