calender_icon.png 5 November, 2024 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి

04-11-2024 05:04:53 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి ఈ నెల ఆరవ తేదీ నుండి ప్రారంభమయ్యే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరగనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, పంచాయితీ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు సర్వే నిర్వహణపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా సర్వే ప్రక్రియను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.