calender_icon.png 19 November, 2024 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర కుటుంబ సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది

09-11-2024 05:05:44 PM

ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టండి సర్వేకు సహకరించండి

క్షేత్రస్థాయిలో సిబ్బంది వెంట స్థానిక నాయకులు ఉండి అనుమానాలను నివృత్తి చేయండి

51వ డివిజన్లో ఇంటింటి సర్వే తీరును పరిశీలించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే దేశానికి ఆదర్శమని,ఈ సర్వే వల్ల ప్రజల యొక్క స్థితి గతులతో పాటు దామాషా ప్రకారం  అన్ని రకాలుగా లబ్ది చేకూరే అవకాశం ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని 51వ డివిజన్ లో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేపై ప్రజలకు  అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు.

సూపర్ వైజర్లకు ఎన్యూమరేటర్లకు స్థానిక నాయకులు అందుబాటులో ఉండి ప్రతి పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ సర్వేపై ప్రజలకు ఎలాంటి అపోహలు లేకుండా చూడాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు భాద్యతగా వ్యవహరించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని, ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి రాజకీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. సర్వేపై కొందరు చేసే దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు దన్న సింగ్, ఎండి తాజ్, కుర్ర పోచయ్య, నిహాల్ అహ్మద్, కొట్టె ప్రభాకర్, కాంపెల్లి కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.