కులగనణ తోటే బీసీల రాజకీయ భవితవ్యం
కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే
కుల సర్వేలో పాల్గోనని వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
మునుగోడు (విజయక్రాంతి): సమగ్ర కులగణన జరిగి బీసీల లెక్కలు తేల్చాలని గత మూడు దశాబ్దాలుగా చేసిన బీసీల పోరాటం నేడు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ఫలప్రదం అయిందని, కులగనన రాష్ట్ర వ్యాప్తంగా ఒక యజ్ఞం లాగా కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే 90 శాతం విజయవంతమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన 56 ప్రశ్నలకు తమ ఇంటికి వచ్చిన ఎన్యుమూరెటర్ కు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర కులగన జరగాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు గావించామని, దీంతో ప్రభుత్వం స్పందించి కులగనాణ జరుపుతుందని ఆయన అన్నారు. కులగణనతోని బీసీల లెక్కలు తేలుతాయని బీసీల లెక్కలు తేలిన తర్వాత జనాభా దామశ ప్రకారం రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కులగణను అడ్డుకోవాలని రాష్ట్రంలోని కొన్ని, వ్యక్తులు శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదని చివరికి కులగణపై ప్రజల్లో అపోహాలు సృష్టించి గంధరగోల పరచాలని చూశారని దీంతో అలంపూర్ నుండి అదిలాబాద్ వరకు సమగ్ర కులగనాణ చైతన్య యాత్ర నిర్వహించి బీసీలకు కులగణని సర్వేలో పాల్గొనేలా చేశామని ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సమగ్ర కులగనన 80 శాతం పూర్తి కావడం దరిమిల మిగతా 20 శాతం ప్రజలు కూడా స్వచ్ఛందంగా సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమగ్ర కులగణంలో పాల్గొంటేనే రేపటి బిడ్డల భవిష్యత్తుకు పునాదులు పడతాయని లేకుంటే సామాజిక రిజర్వేషన్ దక్కవని ఆయన అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకుండా కులగలను వ్యతిరేకిస్తున్న వారు రిజర్వేషన్లు పొందే హక్కు లేదని కులగనలో పాల్గొనని వాళ్లను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలంతా తమ తమ గ్రామాలకు వచ్చి సమగ్ర కులగణనలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భారతదేశంలోనే ఉంటు ప్రభుత్వం నిబంధనలను ధిక్కరించిన వారిని చట్టాలను ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కఠినంగా వైవరించాలని అవసరమైతే వారి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయడానికి వెనుకాడ వద్దని ఆయన డిమాండ్ చేశారు.సమగ్ర కుటుంబ సర్వే ముగిసిన వెంటనే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాదులో మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెరగడానికి తమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్న 90000 మంది ఎన్యుమెటర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జాజుల సత్యనారాయణ గౌడ్, జాజుల భాస్కర్ కందుల లింగస్వామి, జాజుల వెంకటేష్ కందుల యాదగిరి, ఏపూరి కిరణ్ పాల్గొన్నారు.