- బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ డిమాండ్
- ఆమరణ దీక్ష చేపట్టిన అధ్యక్షుడు సంజయ్‌కుమార్
- రెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్‌లోనే దీక్ష
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. సంస్థ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. దీక్షను సీనియర్ పాత్రకేయుడు పాశం యాదగిరి ప్రారంభించారు. బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్లు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ దీక్షలో కూర్చున్నారు.
దాసోజు లలిత, పటేల్ వనజ, కొంగర నరహరి, అశోక్ పోచం, సుజ్జి, వెంకటేష్, రెవెల్లి అజయ్ పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా పోలీస్‌స్టేషన్‌లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా వారి అరెస్టును సభ అధ్యక్షుడు రాజా రాం యాదవ్ ఖండించారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాల నాయకులకు ఎలాంటి హాని జరిగిన ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రాజారాం యాదవ్ హెచ్చరించారు.