calender_icon.png 16 January, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఏలో సమూల ప్రక్షాళన

18-12-2024 02:22:23 AM

  • ఎంట్రన్స్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తది
  • రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించదు
  • 2025 నుంచి అమలులోకి..
  • కేంద్రమంత్రి ధర్మేంద ప్రధాన్ వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో ఎన్టీఏ 2025 నుంచి ఎలాంటి రిక్రూట్‌మెంట్ పరీక్షలను  నిర్వహించదని, కేవలం ఉన్నత విద్య ప్రవేశపరీక్షల నిర్వహణపై మాత్రమే దృష్టి పెడు తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మంగళవారం ప్రకటించారు. నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో లీకులు, పరీక్షల రద్దు నేపథ్యంలో  తీసుకోవాల్సిన చర్య ల కోసం ఉన్నతస్థాయి ప్యానెల్‌ను  కేంద్రం ఏర్పాటు చేసింది. 

 ఈ ప్యానెల్ చేసిన సిఫారసు సంస్కరణల్లో భాగంగా ఈ మార్పులు చేశామని ఆయన వెల్లడించారు. ఎన్టీఏను సమూల ప్రక్షాళన  చేస్తామని, వచ్చే ఏడాదిలో మరిన్ని మార్పులు రానున్నాయని ఆయన చెప్పారు. కొత్తగా పది పోస్టులు సృష్టిస్తామన్నారు. జీరో ఎర్రర్ టెస్టింగ్ ఉండేలా ఎన్‌టీఏ పనితీరులో మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. 

ఏడాదికి ఒక్కసారే సీయూఈటీ..

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ ఏడాదికి ఒక్కసారే మాత్రమే నిర్వహిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. అలాగే నీట్ యూజీ పరీక్షలు పెన్ పేపర్ విధానంలో నిర్వహించాలా లేక ఆన్‌లైన్‌లో చేపట్టాలా అనే అంశంపై ఆరోగ్య మంత్రిత్వశాఖతో చర్చలు జరుతున్నామన్నారు. అయితే భవిష్యత్తలో అన్ని ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్‌గా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్యానెల్..

నీట్ యూజీ, పీహెచ్‌డీ, నెట్ ఎగ్జామ్‌లో లీకులు, రద్దు కావడం, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో నేపథ్యంలో ఎన్టీఏ పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, న్యాయం గా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఇస్రో మాజీ చీఫ్ ఆర్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్యానెల్‌ను జూలైలో కేంద్రం ఏర్పాటు చేసింది. ఎన్టీఏ ప్రాథమికంగా ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని, తన సామర్థ్యాన్ని పెంపొందించుకున్న తరువాత ఇతర పరీక్షలకు దాని పరిధిని విస్తరించాలని తన నివేదికలో ప్యానెల్ సూచిం చింది. 

ఎన్టీఏ పునర్మిర్మాణానికి కమిటీ 10 నిర్దిష్టమైన సిఫారసులను సూచించింది. వీటి లో సాంకేతికత, ఉత్పత్తులు, కార్యకలాపాలు, పరీక్ష భధ్రత, నిఘా తదితర అంశాలపై సూచనలు చేసింది. ఎన్టీఏ డొమైన్‌ను నిర్వహంచడానికి అనుభవం, నైపుణ్యం కలిగి, భవిష్యత్తులో ఎటువంటి పరీక్షలనైనా నిర్వహించడానికి బాధ్యత వహించే మానవ వనరులను నియమించుకుని వారి సహాయంలో అన్ని పరీక్షలను నిర్వహించాలని తన నివేదికలో పేర్కొన్నది.

పరీక్ష ఆడిట్, నైతికత, పారదర్శకత, నామినేషన్స్, సిబ్బంది పరిస్థితులు, వాటాదారుల సంబంధాలను  పర్యవేక్షించడానికి ఎన్టీఏ మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీలు సాధికారత, జవాబుదారీని కలిగి ఉండాలని పేర్కొన్నది. డీఐజీఐ(డిజీ) తరహాలో డీఐజీఐె ఎగ్జామ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని  ప్యానెల్ సిఫారసు చేసింది. ఈ విధానంలో పరీక్ష రాసే అభ్యర్థి మాత్రమే ఉద్దేశించిన ప్రొగ్రామ్‌లో చేరారని నిర్దారించుకోవచ్చని సూచించింది. 

ఆధార్, బయోమెట్రిక్, ఏఐ ఆధారిత డాటాలను వినియోగించుకుని అభ్యర్థిని వివిధ దశల్లో గుర్తించాలని పేర్కొన్నది. దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు. నవోదయా స్కూల్స్, ప్రముఖ యూనివర్సిటీలు, సంస్థలను కలుపుతూ నేషనల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి దేశఃలో 400 నుంచి 500 పరీక్ష కేంద్రాలనే ఒక సంవత్సంరంలో  ఏర్పాటు చేయాలని సూచించింది. దీని ద్వారా ఒక సెషన్‌లో  2 లక్షల నుంచి 2.5 లక్షల అభ్యర్థుల సామర్థ్యాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(’సీబీటీ) ద్వారా నిర్వహించవచ్చని తెలిపింది. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రామాణికమైన, అన్ని సౌకర్యాలు ఉన్న సీబీటీ  పరీక్ష కేంద్రాన్ని ఎన్‌టీఏ కలిగి ఉండాలని సూచించింది.