calender_icon.png 16 January, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితానికి ఒక తోడుండాలి!

29-10-2024 12:00:00 AM

ప్రతి ఒక్కరి జీవితంలో కొందరు ప్రత్యేక వ్యక్తులు ఉంటారు. వారు స్నేహితులు, బంధువులు ఎవరైనా కావొ చ్చు. అయితే మనకు ఎంత మంది స్నేహితులు ఉన్నారనేది ముఖ్యం కాదు. ఎలాంటి స్నేహితులు ఉన్నారనేది ముఖ్యం అంటున్నారు నిపుణులు. మన జీవితం సంతోషంగా ఉండాలంటే ఎలాంటి స్నేహితులు అవసరమో వారు సూచిస్తున్నారు.

ఒకే రక్తం పంచుకొని పుట్టకపోయి నా.. అవసరానికి కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఆదరించే స్నేహితుడు ఒకరైనా మనకు తప్పనిసరిగా ఉండాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఇలాంటి స్నేహితుడు ఒకరైనా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి లను తట్టుకోవాలంటే మన మనసులో ఉన్న మాటలు వినే స్నేహితుడు ఒకరైనా ఉండాలని చెబుతున్నారు.

ప్రతి మాటకు అడ్డుతగిలే వారు కాకుండా.. మన అభిప్రాయా లు వినేవారు ఉంటే జీవితంలో అనేక సమస్యలు దూరమవుతాయంటున్నారు. అంతేకాకుండా మన మూడ్ బాలేనప్పుడు నవ్వించే స్నేహితుడు ఒకరుంటే అనేక సమస్యలు దూరమవుతాయి. అలాంటి స్నేహితుడు మనకు ప్రతి సమస్యలోను కొత్త కోణాన్ని చూపించడమే కాకుం డా మనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పగలుగుతారు.