calender_icon.png 24 February, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోపిడీ లేని సమాజం కోసం కమ్యూనిస్టు పని చేయాలి

21-02-2025 04:45:23 PM

అన్నవరపు సత్యనారాయణ..

పాల్వంచ (విజయక్రాంతి): ప్రతి కమ్యూనిస్టు దోపిడీ లేని సమాజం కోసం పనిచేయాలని సిపిఎం పార్టీ నాయకులు అన్నవరపు సత్యనారాయణ అన్నారు. ఫిబ్రవరి 21 రెడ్ బుక్ డే సందర్భంగా పాల్వంచ సిపిఎం ఆఫీసులో కే సత్య అధ్యక్షతన పట్టణ, మండల కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఏ సత్యనారాయణ మాట్లాడుతూ... కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతు కూలీలు కార్మికులు అసంఘటిత కార్మికుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తుందని, బడ్జెట్లో వీరి సంక్షేమ కోసం ఎలాంటి నిధులు కేటాయింపులు జరగలేదన్నారు.

నిత్యవసరాల సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఇలాంటి ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాలని, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్ కొండబోయిన వెంకటేశ్వర్లు రూరల్ పార్టీ కార్యదర్శి పాకాల వెంకటరావు పట్టణ కార్యదర్శి పి తులసీరామ్ పట్టణ నాయకులు ఎస్కే నిరంజన్ వి రాములు గౌసియా తదితరులు పాల్గొన్నారు.