calender_icon.png 23 October, 2024 | 4:56 AM

దివ్యాంగుడితో ఓటు వేయించిన కలెక్టర్

04-05-2024 02:22:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి) : పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్, వయోవృద్ధులు, దివ్యాంగులు ముందస్తుగా నమోదు చేసుకున్న ప్రకారం శుక్రవారం ఓటు వేశారు. అధికారులు ఎంపిక చేసిన కేంద్రాల్లో పలువురు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయగా, వృద్ధులు హోం ఓటింగ్ వేశారు. ఈ సందర్భంగా అధికారులు స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. హోం ఓటింగ్ పద్ధతిలో 121మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం 112 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. హోం ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఓ దివ్యాంగుడి ఇంటి వద్ద జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మోకాళ్లపై కూర్చొని ఓటింగ్ ప్రక్రియను చేపట్టడం విశేషం.