calender_icon.png 25 April, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న కలెక్టర్

24-04-2025 07:40:48 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన కారులో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం నస్రుల్లాబాద్ లో భూభారతి సదస్సులో కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్(Collector Ashish Sangwan)  పాల్గొని కామారెడ్డికి తిరిగి వెళ్తున్నారు. అదే సమయంలో నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా వద్ద ప్రమాదం జరగగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన కామారెడ్డి కలెక్టర్ వెంటనే తన వాహనాన్ని ఆపారు. బాధితులతో మాట్లాడి తన వెంట ఉన్న డీపీఆర్వో వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.