calender_icon.png 26 February, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

25-02-2025 10:06:17 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లిలో గల కూకట్పల్లి జూబ్లీహిల్స్ కుత్బుల్లాపూర్ నాంపల్లి లకు కలిపి నిర్వహిస్తున్న మహత్మా జ్యోతిబా పూలే, బిసి వెల్పేర్ రెసిడెన్షియల్ (బాలుర) స్కూల్, జూనియర్ కాలేజీని  కలెక్టర్ గౌతం మంగళవారం రాత్రి తనిఖీ చేసారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు. భోజన శాలలో టేబుల్లు, కుర్చీలు విద్యార్థులకు సరిపడా ఏర్పాటు చేయాలని కలెక్టరు ప్రిన్సిపల్ కు సూచించారు. తరగతి గదులలో పనిచేయని ఫ్యాన్లను వెంటనే మరమ్మతు చేయించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఈరోజు మెనులో ఏమి వండారని వంటలను పరిశీలించారు. స్కూలు కాలేజీ కలిపి మొత్తం ఎంత మంది విద్యార్థులున్నారని, ఇంటర్ లో ఏఏ గ్రూపులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ మార్కులను సాధించే విద్యార్థులకు భవిష్యత్తులో చదువుకునే కోర్సులపై మార్గదర్శకం అందిస్తూ వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని  ప్రిన్సిపల్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దారు యాదిరెడ్డి ఎంపీడీవో మమతా బాయ్ డి సి ఓ రాజేష్ ఆర్ సి ఓ వెంకటేశ్వరరావు ప్రిన్సిపల్ షీలా, తదితరులు పాల్గొన్నారు.