calender_icon.png 5 February, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

04-02-2025 11:15:25 PM

మెదక్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా కేంద్రం పిల్లికొటాల్ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య విద్యార్థులతో వారి విద్య భోదన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల క్యాంటీన్ నిర్వహణ, ల్యాబ్ నిర్వహణ, హాస్టల్ వసతుల గురించి ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్ కలెక్టర్ కు వివరించారు. విద్యార్థులకు ఏవిదమైన ఇబ్బందులు లేకుండా అన్నీ ఆదునిక సౌకర్యాలతో విద్య భోదన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వైస్ ప్రిన్సిపాల్ Dr. జయ, సూపరిండెంట్ శివదయాళ్ విద్యార్థిని, విద్యార్థులు బోధన సిబ్బంది పాల్గొన్నారు.