calender_icon.png 27 December, 2024 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారడవిలో కలెక్టర్ కాలినడక ప్రయాణం

17-09-2024 05:29:16 AM

  1. 8 కి.మీ. నడిచి ఆదివాసుల బాంబోక్లస్టర్ సందర్శన 
  2. టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): అటవీ ప్రాంతంలో ఆదివాసుల బాంబో క్లస్టర్‌ను సందర్శించాలనే పట్టుదల తో భద్రాద్రి కలెక్టర్  జితేష్ వి పాటిల్ సాహసం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చం ద్రగొండ మండలం బెండాలపాడు గ్రామ స మీపంలో అటవీ ప్రాంతంలో ఆయన నడుచుకుంటూ వెళ్లి బాంబో క్లస్టర్‌ను  సందర్శించారు. సోమవారం ఉదయం 7 గంటలకే  చంద్రుగొండ మండలం మారుమూల గ్రామమైన గిరిజన ఆదివాసుల నివాసం బెండాలపాడుకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లారు. బ్యాంబో క్లస్టర్ సభ్యులతో కలిసి 8 కిలోమీటర్లు నడిచి కొండపైకి ఎక్కారు. కొం డపై ఉన్న వీరభద్రస్వామి, శివాలయంలో ప్రత్యేక పూజులు చేశారు.

అక్కడ ఉన్న ఏనుగుల మోటబావి, పసుపుబావి, బొడ్రాయి, పల్లెరు బావి, ఫారెస్టు వాచ్ టవర్, పెనుబలిల, కల్లూరు, తల్లాడ, ఏన్యూరు, జూలూరుపాడు  మండలాల సరిహద్దు కొండలు, అటవీ ప్రాం తాన్ని తిలకించారు. కొండ కింద ఉన్న హస్తాలు వీరన్న, జలపాతాలు, ఫారెస్టు చెక్‌డ్యాంలను సందర్శించారు. అనంతరం బ్యాంబో క్లస్టర్‌ను సందర్శించారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడు తూ.. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఫజల్ బక్ష్, జిల్లా నేత భోజ్యా నాయక్, బ్యాంబో క్లస్టర్ చైర్మన్ వీసం నాగభూషనం, వైస్ చైర్మన్ మల్లం కృష్ణయ్య, బొర్రా సురేష్, కారం అన్వేష్, వర్సా శ్రీను, కుంజా కిష్టయ్య ఉన్నారు.