calender_icon.png 30 October, 2024 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠాలు చెప్పిన కలెక్టర్

21-07-2024 03:09:36 AM

రాజన్న సిరిసిల్ల, జూలై 20 (విజయక్రాంతి): పాఠశాలలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు పాఠాలు బోధించి ఉపాధ్యాయుడిగా మారారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత పాఠశాలను శనివారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం పాఠాలను బోధించారు. పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలురాబట్టారు. గణితం, ఆంగ్లం సబ్జెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు.

అనంతరం మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. టాయిలెట్లు, పరిసరాలను పరిశీలించి, ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిక, సాధారణ సెలవు రిజిస్టర్లను పరిశీలించినారు. ముందస్తు సమాచారం లేకుండా, సెలవు దరఖాస్తు ఇవకుండా గైర్హాజరైన ఉపాధ్యాయులపై చర్యలకు డీఈవోకు ఆదేశాలు జారీచేశారు. కాగా, అధికారికంగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఓ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)రాధారాణిని సస్పెండ్ చేస్తూ సాయంత్రం ఉత్తరులు జారీ చేశారు.