calender_icon.png 26 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొమ్మిది కథల సమాహారం

17-07-2024 12:34:25 AM

మలయాళ చిత్రసీమలో కొత్త శకానికి నాంది పలికే వెబ్ సిరీస్ ‘మనోరథంగల్’. ప్రముఖ సాహిత్య కారుడు మాదత్ తెక్కెపాట్టు వాసుదేవన్ నాయర్ రచించిన తొమ్మిది కథల సంకలనమే ‘మనోరథంగల్’ సిరీస్. ఈ తొమ్మిది కథలకూ ఓ సంబంధం ఉంటుంది. తొమ్మిది మంది సూపర్ స్టార్లు, 8 మంది లెజెండరీ దర్శకులతో ఈ సిరీస్ తెరకెక్కించారు. మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాశ్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరవోతు, హరీశ్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ వంటి వారు ఈ తొమ్మిది కథల్లో నటించారు.

వాసుదేవన్ నాయర్ 90వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ మంగళవారం వెల్లడిస్తూ సిరీస్ విశేషాలను పంచుకున్నారు. జీ5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ.. “మాలీవుడ్ టాలెంట్ అంతా ‘మనోరథంగల్’ ద్వారా ఒకేచోటకు రానుంది. మలయాళ సినిమా అసాధారణ సృజనాత్మకతను అందరికీ ఈ సిరీస్ ద్వారా తెలుస్తుంది. దీన్ని హిందీ, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేస్తున్నాం” అని తెలిపారు.