calender_icon.png 21 January, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలిపోతున్న ఆదివాసీల ఆలయం

21-01-2025 12:07:33 AM

  1. పట్టించుకోని పాలకగణం
  2. శిథిలావస్థకు బైరం దేవ్, మహాదేవ్ ఆలయం

ఆదిలాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): అడవుల జిల్లా ఆదిలాబాద్‌లోని ప్రాచీన కట్టడాలు కనుమరుగవుతున్నాయి. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న పలు ప్రాచీన ఆలయాలు శిథిలావస్థకు చేరాయి. పరిరక్షించాల్సిన ప్రభుతాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఆదివాసీల పురాతన ఆలయాలైన బైరం దేవ్, మహాదేవ్ ఆలయం కూడా శిథిలావస్థకు చేరింది. ఆలయ కట్టడాలు నెలకొరిగి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆల  శిఖరం నుంచి నల్లరాతి బండలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భక్తులు ఆం  చెందుతున్నారు.

ఆలయం పూర్తిగా కనుమరుగు అవకముందే, ఆలయాన్ని పు  ఆదివాసీలు కోరుతున్నారు. ఆలయ పునరుద్ధరణకై పురావస్తు శా  అధికారులు రెండేళ్ల కిందట సందరించారు. కానీ పునరుద్ధరణకు ఎలాంటి చర్య  చేపట్టలేదు. 

11వ శతాబ్దంలో నిర్మాణం

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామంలో గల అటవీ ప్రాం  బైరందేవ్ ఆలయాన్ని 11వ శతాబ్దంలో శాతవాహనులు నిర్మించారని చెపుతారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బైరందేవ్ ఆలయాన్ని నల్లటి రాతిబండతో నిర్మించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయం ఉమ్మడి నేడు నిరాధారణకు గురవుతోంది. 

పుష్య మాసంలో జాతర 

ఆదివాసీకు పుష్యమాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో 23 వ తేదీ నుంచి జాతర ప్రారంభమవుంది. 23న కోరంగే వంశస్థులు ఆలయంలో బైరందేవ్ మహాదేవులకు ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభిస్తారు. 23 నుంచి 29వ తేదీ వరకు కొనసాగే జాతరలో భాగంగా 27వ తేదీన దర్బార్ నిరహిస్తారు. ఈ జాతరకు ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.

పురాతన విగ్రహాల నిజదరనం

బైరందేవ్ మహాదేవ్ ఆలయంలోని ప్రాచీన విగ్రహాలకు ఎన్నో సంవత్సరాలుగా భక్తులు పూజలు నిరహిస్తు న్నారు. 2023 లో బైరందేవ్ విగ్రహం పైన ఉన్న చందన లేపనం కింద పడటంతో బైరందేవ్ విగ్రహ నిజసరూపం బయట పడింది. కోరంగే వం  ఆలయ కమిటీ సభ్యులు మిగితా విగ్రహాల చందన, సింధూర లేపనం తొలగించారు. దీంతో ఎన్నో విగ్రహాల సరూపాలు బయట పడ్డాయి. భైరందేవ్‌తో పాట పక్కనే ఉన్న ఋషిముని, నాగ సరూపంతో పాటు అనేక రూపాలు దరనమిచ్చాయి.