calender_icon.png 5 December, 2024 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ కిందపడి చిన్నారి మృతి

04-12-2024 11:36:00 PM

ఆళ్లపల్లి మండలంలో ఘటన..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని ఆళ్లపల్లి మండలం ఆనంతోగు గ్రామంలో బుధవారం ట్రాక్టర్ కిందపడి చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే అనంతోగు గ్రామానికి చెందిన గలిగే నరేష్, కృష్ణవేణిల కుమార్తె కిరణ్య బుధవారం నాయనమ్మ మొక్కజొన్న కూలికి వెళుతుంటే ఆమెతో కలిసి వెళ్ళింది. సాయంత్రం కూలి పని ముగించుకొని ట్రాక్టర్లో ఇంటికి వస్తున్న క్రమంలో కిరణ్య జారీ కింద పడటంతో ఆమెపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి పట్ల నిర్లక్ష్యమే ఆమె ప్రాణాలు తీసింది అని గ్రామంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనంతలోకాలకు విషాదఛాయలు అలుముకున్నాయి.